TG: ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో కేంద్రమంత్రి బండి సంజయ్ కార్మికులకు కీలక విజ్ఞప్తి చేశారు. కార్మికులు ఎవరూ ఆవేదనతో ఆత్మహత్యలు చేసుకోవద్దని, ప్రాణాలు తీసుకోవడం దేనికీ పరిష్కారం కాదని హితవు పలికారు. ఇలాంటి నిర్ణయాలతో మీ కుటుంబాలను అనాథలుగా మార్చవద్దని కోరారు. కార్మికులకు బీజేపీ ఎప్పుడూ అండగా ఉంటుందని, మీ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం తమ పార్టీ పోరాడుతుందని భరోసా ఇచ్చారు.