KNR: శ్రీ సగర భగీరథ మహర్షి పట్టుదల, సంకల్పం నేటి తరానికి ఆదర్శమని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భగీరథ మహర్షి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్, ఉన్నతాధికారులు సగర సంఘం నాయకులతో కలిసి భగీరథ మహర్షి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.