GDWL: బీచుపల్లి క్షేత్రంలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ ఇన్ఛార్జ్ ఈవోగా జమ్మిచేడు శ్రీ జమ్ములమ్మ పరశురామస్వామి దేవాలయ మొదటి శ్రేణి కార్యనిర్వహణాధికారి పురందర్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు దేవాదాయ శాఖ కమిషనర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం జమ్మిచేడు ఆలయ ఈవోగా విధులు నిర్వర్తిస్తున్న ఆయన, అదనపు బాధ్యతగా బీచుపల్లి క్షేత్ర బాధ్యతలను స్వీకరించారు.