TPT: శ్రీకాళహస్తి ఆర్డీవో కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు నిరసన తెలిపారు. తమ చేత గొడ్డు చాకిరి చేయించుకుని కనీస వేతనాలు ఇవ్వడంలో కూటమి ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుందని అంగన్వాడీలు ధనలక్ష్మి, స్వర్ణ మండిపడ్డారు. తమ న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.