NZB: జిల్లాలో ఓపెన్ పది, ఇంటర్ పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా జరిగాయి. ఓపెన్ పదో తరగతికి జరిగిన సైన్స్ & టెక్నాలజీ పరీక్షకు 12 పరీక్షా కేంద్రాల్లో 2,481 మందికి గాను 2,196 మంది హాజరుకాగా 285 మంది గైర్హాజరయ్యారని డీఈవో అశోక్ వెల్లడించారు. ఓపెన్ ఇంటర్‌కు జరిగిన బిజినెస్ కామర్స్ పరీక్షకు 15 పరీక్షా కేంద్రాల్లో 1,756 మందికి 1,585 మంది హాజరయ్యారు.