TG: సచివాలయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖరీఫ్ సీజన్ సాగుపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయ కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి, అగ్రి వర్సిటీ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. ప్రధానంగా ఖరీఫ్ సీజన్ కోసం సాగుకు అనుకూలమైన సన్న వరి రకాల ఎంపిక, విత్తనాల లభ్యత, సాగు ప్రణాళికపై సుదీర్ఘంగా చర్చించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలను సకాలంలో అందించడమే లక్ష్యమని ఈ సందర్భంగా వెల్లడించారు.