CTR: చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ కార్యాలయంలో శుక్రవారం “ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)” కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని మొత్తం 38 వినతులు స్వీకరించారు. పలు సమస్యలను అక్కడికక్కడే అధికారులతో చర్చించి పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. చిత్తూరు అర్బన్, గుడిపాల, రూరల్ మండలాల ప్రజలు హాజరయ్యారు.