ADB: తాంసి మండలంలోని పొన్నారి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆడే గజేందర్ ఘనంగా ప్రారంభించారు. ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం పేద ప్రజలకు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. గృహం లేని కుటుంబాలకు సొంత ఇల్లు కలగడం ఒక గొప్ప అవకాశమని పేర్కొన్నారు.