SRPT: ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సహకారంతో అన్ని వార్డులకు మౌళిక సదుపాయాలు కల్పిస్తాం అని కోదాడ మున్సిపల్ ఛైర్మన్ ఎర్నేని కుసుమ వెంకట్ రత్నం బాబు అన్నారు. ఇవాళ కోదాడ మున్సిపల్ పరిధి లోని 31వ వార్డులో డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. కోదాడ పట్టణంలో దశల వారీగా అన్ని వార్డులకు సీసీలు, డ్రైనేజీలు ఇతర వసతులు కల్పిస్తాం అన్నారు.