అర్జున్ సర్జా మూవీ ‘జెంటిల్ మెన్’పై హీరో రాజశేఖర్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. ఆ చిత్రంలో హీరోగా నటించమని మేకర్స్ తనను అడిగారని, అడ్వాన్స్ కూడా ఇచ్చేందుకు సిద్ధమయ్యారని తెలిపాడు. అయితే, ఆ సమయంలో తాను ‘అల్లరి ప్రియుడు’ సినిమా షూటింగ్లో బిజీగా ఉండటం వల్ల డేట్లు ఇవ్వలేకపోయానని, అందుకే ఆ ఆఫర్ను వదులుకోవాల్సి వచ్చిందని వివరించాడు.