నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న ‘ది ప్యారడైజ్’ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో నాని, మోహన్ బాబు మధ్య వచ్చే సన్నివేశాలు హైలైట్గా ఉండబోతున్నాయని సమాచారం. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో కీలక సీన్లను చిత్రీకరించగా, అవి అద్భుతంగా వచ్చాయని టాక్. థియేటర్లలో ఈ ఇద్దరి నటన వెండితెరపై మ్యాజిక్ క్రియేట్ చేయడం ఖాయమని తెలుస్తోంది.