ATP: వాసవి అమ్మవారి మాత జయంతి సందర్భంగా శనివారం తాడిపత్రిలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. ఈ పూజ కార్యక్రమానికి తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రంలో పంటలు బాగా పండి ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ అమ్మవారిని వేడుకున్నానన్నారు.