ప్రముఖ కాఫీ దిగ్గజం స్టార్బక్స్ తమ టెక్నాలజీ విభాగంలో సిబ్బందిని తొలగిస్తోంది. ఎంతమందిని తొలగిస్తున్నారనేది ఇంకా స్పష్టం కాలేదు. గతంలోనే అమెరికా, కెనడాలో వందలాది స్టోర్లను మూసివేసిన ఈ సంస్థ, వేల సంఖ్యలో రిటైల్, కార్పొరేట్ ఉద్యోగులను ఇంటికి పంపింది. ఖర్చులను తగ్గించుకోవడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.