MBNR: నవాబుపేట మండల కేంద్రంలో వాసవీ కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘ సభ్యులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. వివిధ సంఘాల సమన్వయంతో వేడుకలు విజయవంతంగా ముగిశాయి. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.