ప్రముఖ కమెడియన్ సత్య హీరోగా, దర్శకుడు రితేష్ రానా కాంబోలో వస్తున్న చిత్రం ‘జెట్లీ’. 2026, మే 1న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. తాజాగా ఈ మూవీ సెన్సార్ పనులు పూర్తయ్యాయి. సెన్సార్ సభ్యులు ఈ మూవీకి U/A సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇక ఇందులో మిస్ యూనివర్స్ ఇండియా-2024 రియా సింఘా హీరోయిన్గా నటించింది.