స్నాప్‌చాట్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు మెటా యాజమాన్యంలోని ఇన్స్టాగ్రామ్ ‘ఇన్‌స్టాంట్స్'(Instants) పేరుతో సరికొత్త క్విక్ ఫొటో షేరింగ్ యాప్‌ను లాంచ్ చేసింది. ప్రస్తుతం ఈ యాప్ స్పెయిన్, ఇటలీలోని ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే భారత్ సహా మిగతా దేశాల్లోనూ ఈ యాప్‌ను విడుదల చేసేందుకు కంపెనీ సిద్ధమవుతోంది.