ATP: జిల్లాలో మహిళలను ఎరగా వేసి, న్యూడ్ ఫొటోలతో అమాయకులను బ్లాక్ మెయిల్ చేస్తున్న ముఠా గుట్టు రట్టయిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. కాగా, నిందితులకు టీడీపీ ఎమ్మెల్యేలతో సంబంధాలు ఉన్నాయని వైసీపీ ఆరోపిస్తోంది. వారికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.