తూ.గో జిల్లా మండపేటలో పాడైన సీసీ రోడ్లకు శుక్రవారం మరమ్మతులు చేపట్టారు. ఇందిరా గాంధీ బైపాస్ రోడ్డు రాజారత్న, సత్యశ్రీ రోడ్, ప్రధాన రహదారిలో పగుళ్లు ఏర్పడి అధ్వాన్నంగా ఉన్నాయి. రహదారులు మరమ్మతులకు మునిసిపల్ నిధులు రూ.5 లక్షలతో తారు పూత, పూడ్చివేత పనులు జరుగుతున్నాయి.డి ఇ కింతాడ శ్రీనివాస్,ఏ ఈ దాసరి పవన్, ఆర్ అనూష పనులను పర్యవేక్షించారు.