TG: ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. రేపు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో కార్మిక సంఘాలతో చర్చలు జరగనున్నాయి. ఈ భేటీలో పలువురు మంత్రులు కూడా పాల్గొంటారని సీఎం రేవంత్ వెల్లడించారు. సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవడానికి యూనియన్ నేతలను ఆహ్వానిస్తున్నామని, కార్మికులు ఎవరూ తొందరపడొద్దని సూచించారు.