TG: రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఆర్టీసీ కార్మికుల సమస్యలపై లోతుగా చర్చించినట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించిన కార్మికులు ఇప్పుడు సంయమనం పాటించాలని కోరారు. ప్రాణాలు తీసుకోవడం వంటి అనాలోచిత చర్యలు చేయవద్దని, ప్రభుత్వంపై నమ్మకం ఉంచాలని విజ్ఞప్తి చేశారు. క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుని కొత్త సమస్యలు తెచ్చుకోవద్దని మంత్రి సూచించారు.