ASR: మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో సమస్యలను త్వరగా పరిష్కరించాలని పాడేరు ఐటీడీఏ పీవో ఆదిత్య వర్మ అధికారులను ఆదేశించారు. శనివారం మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్పటల్లో సమస్యలను తెలుసుకున్నారు. బాలింతలు, గర్భిణీలతో ముచ్చటించారు. వారికి అందుతున్న సేవలపై ఆరా తీశారు. విద్యుత్తు, ప్లంబింగ్, నీటి సమస్యలు ఉన్నాయని తనిఖీల్లో గుర్తించారు.