మహబూబ్ నగర్ జిల్లా కోయిలకొండ మండల కేంద్రంలో రోడ్డు భద్రత నియమాలు పాటిస్తున్న వాహనదారులకు ఎస్సై తిరుపాజి పూలు అందించి వినూత్నంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, కార్లు నడిపేవారు సీట్ బెల్ట్ ధరించాలని కోరారు.