BPHL: టేకుమట్ల మండలం రామకృష్ణాపురానికి చెందిన యువకుడు ప్రేమ పేరుతో ఐదేళ్లుగా యువతిని మోసం చేసి, మరో యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడు. బాధిత యువతి అతని ఇంటి ఎదుట రెండు రోజులుగా ఆందోళన చేపట్టింది. కుటుంబ సభ్యులు దాడి, కులదూషణ చేశారని ఆరోపించింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని వాపోయింది. న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తానని పేర్కొన్నారు.