CSKతో జరుగుతున్న మ్యాచ్లో SRH ఓపెనర్ అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 15 బంతుల్లోనే 5 ఫోర్లు, 4 సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మాథ్యూ షార్ట్ వేసిన 5వ ఓవర్లో 1,4,4,4,6,6 బాది ఒకే ఓవర్లో 25 పరుగులు పిండుకున్నాడు. దీంతో హైదరాబాద్ 5 ఓవర్లలోనే 63 పరుగులు సాధించింది. ఉప్పల్ స్టేడియం అభిషేక్ సిక్సర్లతో హోరెత్తిపోతోంది.