అన్నమయ్య: చిన్నపిల్లలు జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతున్నాయని, దీని ప్రభావం గర్భిణీలలో పిండం ఎదుగుదలపై కూడా పడే అవకాశం ఉందని అంగన్వాడీ సూపర్వైజర్ మస్తానమ్మ తెలిపారు. పోషణ పక్వడా కార్యక్రమంలో భాగంగా శనివారం దప్పేపల్లి గ్రామంలో చిన్నపిల్లలు, బాలింతలు, గర్భిణీలతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు.