AP: మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడం బాధాకరమని మహిళా కమిషన్ ఛైర్పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. ప్రతిపక్షాలు బిల్లును వ్యతిరేకించడం దురదృష్టకరమని పేర్కొన్నారు. చట్టసభల్లో మహిళలకు ప్రాతినిధ్యం అవసరమని అభిప్రాయపడ్డారు. కాగా, నిన్న పార్లమెంట్లో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లుకు మెజార్టీలేకపోవడంతో వీగిపోయిన సంగతి తెలిసిందే.