RCBతో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో DC అద్భుత విజయం సాధించింది. 176 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ 19.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఒక దశలో 18 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును రాహుల్ (57), స్టబ్స్ (60*) అర్ధ సెంచరీలతో ఆదుకున్నారు. చివరి ఓవర్లో 15 పరుగులు కావాల్సి ఉండగా, షెపర్డ్ బౌలింగ్లో మిల్లర్ 2 సిక్సర్లు బాది జట్టును గెలిపించాడు.