KNR: హుజూరాబాద్ మండలం చెల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్వో డాక్టర్ వెంకటరమణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అసంక్రమిత వ్యాధుల స్క్రీనింగ్ పెంచాలని, హెచ్పీవీ వ్యాక్సిన్ శాతం పెంపుపై దృష్టి పెట్టాలని సిబ్బందికి సూచించారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో వడదెబ్బ లక్షణాలపై ప్రజలకు అవగాహన కల్పించి, వోఆర్ఎస్ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.