ADB: కేంద్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఇండో-యూఎస్ ట్రేడ్ డీల్ ద్వారా దేశ ప్రయోజనాలను అమెరికా చేతిలో తాకట్టు పెడుతున్నారని యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ శనివారం పట్టణంలోని ఇందిరా పార్క్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. దీంతో దేశ ప్రజలతో పాటు రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని అన్నారు.