TG: పంటలకు మద్దతు ధర ప్రకటించడం, ప్రతి ఏటా పెంచడం వరకు కేంద్రం పరిమితమైందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. ఇకనైనా రాష్ట్రంలో మొక్కజొన్నను కొనేందుకు ఈ సీజన్లో ముందుకు రావాలని.. శనగ, పొద్దుతిరుగుడు పంటలను పూర్తిగా కొనాలని విజ్ఞప్తి చేశారు. ఆయా పంటల ఉత్పత్తిలో 25 శాతమే కొంటామన్న పరిమితులతో రాష్ట్రంపై ఆర్థిక భారం పడుతోందన్నారు.