SRPT: తిరుమలగిరి మండలంలో గ్యాస్ ఏజెన్సీ వద్ద ఇవాళ వినియోగదారుల రద్దీ భారీగా పెరిగింది. అంతర్జాతీయ యుద్ధ పరిణామాల నేపథ్యంలో గ్యాస్ కొరత ఏర్పడవచ్చన్న ఆందోళనతో మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు ఒకేసారి ఏజెన్సీకి తరలివచ్చారు. ముందస్తు జాగ్రత్తగా సిలిండర్లు పొందేందుకు వినియోగదారులు పోటీ పడటంతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది.