NTR: ఏ.కొండూరు మండలం కోడూరులో “బడి పిలుస్తోంది” కార్యక్రమం నిర్వహించారు. మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న 5వ తరగతి విద్యార్థులకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రవేశాలు కల్పించారు. ఈ కార్యక్రమంలో ZPHS డి.శరత్ బాబు, MPHS హెడ్మాస్టర్ యం.రాం ప్రదీప్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థుల భవిష్యత్ కోసం ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలన్నారు.