NLG: అకాల వర్షంతో వరి పంట నష్ట పోయిన రైతులను ఆదుకోవాలని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం కొండమల్లేపల్లి మండలం చెన్నారంలో అకాల వర్షంతో వరి పంటను పరిశీలించారు. నష్ట పోయిన రైతులకు ఎకరాకు రూ. 50 వేలు అందించాలని కోరారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను ఆదుకోవడం జరిగిందన్నారు.