భూపాలపల్లి మండల కేంద్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను MLA గండ్ర సత్యనారాయణ రావు ప్రారంభించారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. దళారులను ఆశ్రయించవద్దని సూచించారు. నాణ్యమైన ధాన్యం తీసుకురావాలని, మద్దతు ధరతో 48 గంటల్లో చెల్లింపులు జరుగుతాయని హామీ ఇచ్చారు. కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.