TG: ఉమ్మడి ఏపీ మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ రావు భౌతికకాయానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాళులర్పించారు. పరిపాలనలో తనదైన ముద్ర వేసిన ఆయన మరణం దిగ్భ్రాంతికరమన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆర్థిక మంత్రిగా, కాంగ్రెస్కు ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ప్రభుత్వం తరపున వారి కుటుంబానికి సానుభూతి తెలిపారు. నాదెండ్ల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.