MHBD: ఇనుగుర్తి మండలం కోమటిపల్లి శివారు పాత తండాకు చెందిన ఇస్లావత్ అంజలి (30) తన భర్తతో గొడవపడి ఈనెల 14న పురుగుల మందు తాగడంతో కుటుంబ సభ్యులు వరంగల్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతురాలి తండ్రి ఈర్య నాయక్ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కరుణాకర్ తెలిపారు.