ADB: 2028వ సంవత్సరంలో BRS పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని బోథ్ MLA అనిల్ జాదవ్ పేర్కొన్నారు. బుధవారం బజార్హత్నూర్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన నాయకులు MLA సమక్షంలో BRS పార్టీలో చేరారు. వారికి MLA కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఎమ్మెల్యే నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమానికి ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు పేర్కొన్నారు.