KMR: బిబిపేట్ వాసి హెడ్ కానిస్టేబుల్ రాజనర్సయ్య (56) గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. స్థానికుల వివరాల ప్రకారం.. రామారెడ్డి PSలో విధులు నిర్వహిస్తున్న ఆయన, కామారెడ్డిలో డ్యూటీ ముగించుకుని తిరిగి వెళ్తుండగా రామారెడ్డి సమీపంలోని హెచ్పి పెట్రోల్ పంపు వద్ద బైక్ నియంత్రణ కోల్పోయి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలయినట్లు తెలిపారు.