రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ బాక్సాఫీస్ వద్ద మరోసారి నిరూపితమైంది. ఆయన నటించిన ‘డార్లింగ్’ రీ-రిలీజ్లోనూ సాలిడ్ రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది. తొలిరోజు ప్రీమియర్స్‌తో కలిపి 7.59 కోట్ల గ్రాస్ వసూలు చేసి, రీ-రిలీజ్ సినిమాల్లో ఆల్ టైమ్ రికార్డులను తిరగరాసింది. ముఖ్యంగా ఏపీ, ఉత్తరాంధ్రలో వసూళ్లు అదిరిపోయాయి.