AP: విశాఖలోని ఆంధ్రా వర్సిటీ వందేళ్ల ప్రస్తానాన్ని పురస్కరించుకుని బీచ్ రోడ్లోని AU కన్వెన్షన్ సెంటర్లో వేడుకలు నిర్వహించారు. ఇందులో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసెఫ్ పాల్గొన్నారు. కన్నతల్లి, గురువును ఎప్పుడూ మరిచిపోకూడదని వెంకయ్యనాయుడు అన్నారు. విద్యార్థులకు చదువుతోపాటు సంస్కారం ఎంతో ముఖ్యమన్నారు.