WGL: ఖిలా వరంగల్ మండలం బొల్లికుంట గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహ ఏర్పాటు వ్యవహారం మరోసారి ఉద్రిక్తతకు దారితీసింది. గురువారం రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాదంతో గ్రామంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు, రెవెన్యూ సిబ్బంది రంగంలోకి దిగి ఇరువర్గాలను శాంతింపజేయడానికి చర్యలు చేపడుతున్నారు.