VZM: ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా జిల్లా గ్రంధాలయ సేవా సంఘం పుస్తక హుండీ కార్యక్రమాన్ని స్థానిక R&B జంక్షన్లో నిర్వహించింది. పుస్తకాలు చదివే అలవాటు తగ్గిపోతున్న ఈ రోజుల్లో ప్రజల్లో చైతన్యానికి, మేధో వికాసానికి పుస్తకాలు చదివించే ఆసక్తి పెంచాలని ధ్యేయంతో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. స్పందించిన పలువురు అనేక గ్రంథాలను గ్రంధాలయ సంఘానికి అందజేశారు.