NLG: నార్కట్పల్లి బస్ డిపో వద్ద జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సంఘీభావం తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ తరపున మద్దతు ప్రకటించారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఆర్టీసీ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.