KNR: శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ 4వ, 6వ సెమిస్టర్ (బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ) పరీక్షలు కొనసాగుతున్నాయి. 4వ సెమిస్టర్ పరీక్షల్లో ఇద్దరు విద్యార్థులు మాల్ ప్రాక్టీస్ పాల్పడగా డిబార్ చేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారి డా. డి.సురేష్ కుమార్ తెలిపారు. 4వ సెమిస్టర్ పరీక్షలకు 9175, 6వ సెమిస్టర్ పరీక్షలకు 10200 హాజరయ్యారని పేర్కొన్నారు.