NRPT: కృష్ణ మండలంలోని కుసుమూర్తి, ఖాన్ దొడ్డి, కున్సి గ్రామాలలో ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తహశీల్దార్ శ్రీనివాసులు ప్రారంభించారు. రైతులు మద్దతు ధరకు ధాన్యం విక్రయించుకోవాలని సూచించారు. కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా సాగేలా అన్ని ఏర్పాట్లు చేశామని, రైతులకు ఇబ్బందులు కలగకుండా చూస్తామని ఆయన తెలిపారు.