CTR: గుడిపాల మండలాన్ని అభివృద్ధి చేసి, స్థానిక యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చెప్పారు. బుధవారం నవీకరించిన గుడిపాల ఎంపీడీవో కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇటీవలే ఎంపీపీగా ఎన్నికైన హరిప్రసాద్ చౌదరి అభినందన సభలో పాల్గొని మాట్లాడారు.