KDP: సైబర్ నేరాలపై అవగాహన పెంచుకొని అప్రమత్తంగా ఉండాలని ఎర్రగుంట్ల SBI మేనేజర్ ఎలమందారెడ్డి ప్రజలకు సూచించారు. బుధవారం ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సైబర్ నేరగాళ్ల నుంచి అప్రమత్తంగా ఉండాలని, ఫోన్లు వినియోగించే క్రమంలో ఆన్లైన్ లింకులు ఓపెన్ చేయడం, OTP వంటివి చెప్పడం చేయరాదని విద్యార్థులకు సూచించారు.