ASF: తిర్యాణి మండల PHCలో గిరిజన గర్భిణుల కోసం లక్షలతో కొనుగోలు చేసిన స్కానింగ్, ఎక్స్రే యంత్రాలు ఆపరేటర్లు లేక మూలనపడ్డాయి. నిర్వహణ లేక అవి తుప్పుపడుతున్నాయి. ఇలాంటి స్థితిలో ప్రభుత్వం తాజాగా మరో కొత్త యంత్రాన్ని కేటాయించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్న యంత్రాలే పనిచేయట్లేదు, కొత్తవి ఎందుకని ప్రశ్నిస్తున్నారు.