SDPT: చిన్నకోడూరు మండలం గోనెపల్లిలో రైతు ఉత్పత్తి దారుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం భారతీయ నూనె గింజల పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు రైతులకు సమతుల్య ఎరువుల వినియోగంపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రధాన శాస్త్రవేత్త డా.అనిల్ కుమార్ మాట్లాడుతూ రైతులందరూ మట్టి పరీక్షల ఆధారంగానే ఎరువుల వాడటం వల్ల నేల సారాన్ని సంరక్షించుకోవచ్చన్నారు.