PLD: కారంపూడిలో 4వ తరగతి విద్యార్థిని నాగలక్ష్మి అనారోగ్యంతో మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. బాధిత కుటుంబానికి పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది అండగా నిలిచి బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకులు అందజేశారు. ఎంఈవోలు అనిల్ కుమార్, రవికుమార్ సమక్షంలో సహాయం అందించారు. గ్రామస్తులు ఉపాధ్యాయుల సేవాభావాన్ని అభినందించారు.